E స్కూల్ గంట మోగాలి

బస్సుల్లో తోటి స్నేహితులతో కొందరు,కాలి నడకన అమ్మ , తోబుట్టువులతో కొందరు,ఆటో రిక్షాలో కొందరు,బైక్ పైన ఇతర స్నేహితులు, వాళ్ల బ్యాక్ ప్యాక్ లతో కుస్తీ పడుతూ మరి కొందరు ఇలా సందడి చేస్తూ గంట మోగక ముందే పలు ప్రదేశాల నుండి పలు రకాల వాహనాలలో పలు రకాల చర్చలు జరుపుతూ ఆనందోత్సాహాలతో స్కూల్ ప్రాంగణంలోకి పిల్లలు, ఉపాధ్యాయులు అడుగిడుతుంటే ఎంతో కోలాహలంగా ఉండేది.అది ఇప్పుడు మన ఊహకు కూడా దొరక్కుండా పోయింది.నిత్యం ఉత్సాహం, నూతన తేజం నింపే పాఠశాల ఇప్పుడు నిస్తేజం అయ్యింది.ఎన్నో మధురానుభూతులను కల్పించిన తరగతి గదులు ఇప్పుడు మూగబొయ్యాయి.ఇంట్లో వండిన పలు రకాల ఆహారాలను తోటి పిల్లలతో పంచుకొని,ఇంటి వద్ద పూర్తి చేసిన ఇంటి పని,ప్రాజెక్ట్ పని తోటి పిల్లలతో పంచుకుంటే ఎంతో ఊరటనిచ్చేది,మనోస్థైర్యాన్ని పెంచేది.

తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ,పరిశోధనలు జరుపుతూ ,పాఠ్యముశాల కృత్యాలద్వార పొందే అనుభవాలను పంచుకుంటూ ,తోటి విద్యార్థులతో చర్చలు జరిపి,ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకుంటూ , వాళ్లు నేర్చుకున్న అంశాలను అందరితో పంచుకుంటూ పొందే ఆనందాన్ని సంతృప్తిని తిరిగి తీసుకురావాలి.ఒక పాఠశాల నడిపే స్వాప్నికులమైన మనము ప్రేక్షక పాత్ర వీడి ప్రభుత్వ GO ల కోసం ఎదురు చూడకుండా తిరిగి భౌతిక పాఠశాలలో పొందే అన్ని అనుభూతులను విద్యార్థులకు మనం కల్పించాలి.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనా విధానంలో మార్పులు తీసుకురావాలి.భౌతిక పాఠశాలలో లభ్యమయ్యే బోధన ఇప్పుడూ కొనసాగాలి.నిర్ధేశిత, నిర్ధారిత మూల్యాంకనాలను జరుపుతూ విద్యార్థుల అభ్యాసనా అవసరాలను తెలుసుకుంటూ ఆ అభ్యాసనా వ్యత్యాసాలు నివారిచుకుంటూ వంద శాతం పూర్తి పాఠశాలను తిరిగి మనం నడపాలి.

ఈ నూతన విద్యా సంవత్సరాన్ని ఎలాంటి అభ్యసనా వ్యత్యాసాలు లేకుండా 100 శాతం పూర్తి పాఠశాలను మనం నడపాలి. 100 శాతం పూర్తి పాఠశాల అనగా ప్రస్తుత పరిస్థితులలో కూడా భౌతిక పాఠశాలలో ఎలాంటి బోధనా ప్రక్రియలు జరుపుతామో , నిర్ధేశిత సమయాల్లో వివిధ పాఠ్య విషయాలను నిరవధికంగ నడుపుతామో ,బోధన అభ్యసన వనరులను వాడుతూ ,క్రమానుసార మూల్యాంకనాలు జరుపుతూ , విద్యార్థుల సందేహాల నివృత్తి జరుపుతూ, సామూహిక అభ్యసనమును కొనసాగి స్తూ ,కృత్యాధార బోధన యొక్క అనుభవాలను కల్పిస్తూ బహుళ మాధ్యమాల ఆధారిత బోదన,విద్యార్థి కేంద్రికృత బోదన ,తోటి విద్యార్థుల నుండి పొందే భావోద్వేగ అభివృద్ధి , తోటి విద్యార్థులతో పోటీపడుతూ ,పునశ్చరణ జరుపుతూ వారి అభ్యసనను కొనసాగించాలి.

ఇది జరగాలి అంటే టెక్నాలజిని వాడవలిసిన అవసరం ఎంతైనా ఉంది. తల్లితండ్రులకు ఆన్లైన్ అభ్యసనా ఈ సంవత్సరం నిరవధికం అని , ఇలాంటి పరిస్థితులలో ఇంకో విద్యా సంవత్సరం పోగొట్టుకునే సాహసం మనం చేయ కూడదు.తల్లి తండ్రులకు రెండు సంవత్సరాల విద్యా నష్టం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది , వారిని చైతన్య పరుస్తూ ,వారి భాగస్వామ్యంతో ఆన్లైన్ ,ఆఫ్లైన్ మాధ్యమాల్లో విద్యాభ్యాసం నిరవధికంగా కొనసాగేలా చూడాలి

ఈ కఠినమైన సమయాల్లో, విద్యార్థులు వారి గృహాల భద్రత నుండి నేర్చు కోవడానికి ప్రత్యక్ష ఆన్‌లైన్ తరగతుల కోసం మేము లీడ్ స్కూల్ @ హోమ్ అను కార్యక్రమమును ప్రవేశ పెడుతున్నాము.ఈ కార్యక్రమము ద్వారా విద్యార్థులు ఆన్లైన్, ఆఫ్ లైన్ మరియు హైబ్రిడ్ మాద్యములలో నిరాటంకంగా తమ అభ్యసనను కొనసాగించెదరు.లీడ్ స్కూల్ @ హోమ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లైవ్ క్లాసులు, రికార్డెడ్ క్లాసులు ,డౌట్ క్లారిఫికేషన్ ,తోటి విద్యార్థులతో సాధన చేస్తూ, బ్రిడ్జి కోర్సులు ,సమ్మర్ క్యాంపు ,చేతన్ భగత్ లాంటి ప్రముఖులతో మాస్టర్ క్లాస్, హోంవర్క్స్ మరియు అసెస్‌మెంట్ సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఇది లీడ్ స్కూల్ పేరెంట్ యాప్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తుంది.

About the author

Venu Gopal Reddy

More from this author

E స్కూల్ గంట మోగాలి

బస్సుల్లో తోటి స్నేహితులతో కొందరు,కాలి నడకన అమ్మ , తోబుట్టువులతో కొందరు,ఆట

Know More

Give Your School The Lead Advantage

Exciting OFFERS ending SOON!!
whatsapp