మీ పిల్లలు ఇంట్లో పరీక్షలు రాయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం
Give Your School The Lead Advantage
సంవత్సరంలో మళ్ళీ సమయం, కేవలం ఈ సమయం మాత్రమే ప్రతిదీ భిన్నంగా ఉంటుంది.
ఈ సంవత్సరం, ప్రపంచ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇళ్లన్నీ పరీక్షా కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ సందర్భంలో, తమ ఇళ్లల్లో పిల్లలు శాంతియుతంగా పరీక్షలు రాయడానికి ఇంటి వాతావరణాన్ని తగినట్లుగా మార్చడం తల్లిదండ్రుల బాధ్యత.
ఆహ్లాదకరమైన వాతావరణానికి అనువుగా ఇంటిని మార్చడం ఎలా అనే విషయంగా కొన్ని చిట్కాలు క్రింద ఇవ్వబడుతున్నాయి.
-
- సౌకర్యవంతమైన చోటు ఎంచుకోండి
అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే, నిశ్శబ్దంగా కాకుండా విశ్రాంతిగా ఉండే కనీస అంతరాయాలతో స్థలాన్ని ఎంచుకోవడం. మీ పిల్లల కోసం ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని అంకితం చేయడం ద్వారా, పిల్లలు ఎక్కువ దృష్టి పెట్టవచ్చు మరియు వారి పరీక్షలను బాగా రాయవచ్చు. మొక్కలను జోడించడం ద్వారా వారి ప్రత్యేక స్థలాన్ని మరింత అనుకూలంగా చేయవచ్చు. - మీ పిల్లలు వ్యవస్థీకృతంగా వ్యవహరించేలా చేయడానికి సహాయం చేయండి
పరీక్షకి కూర్చోవడానికి ముందు, మీ పిల్లలకి ఆ పరీక్ష రాయడానికి అవసరమైన అన్ని రకాల నియమనిబంధనల్నీ చెక్ చేయండి. ఉదాహరణకు, గణిత పరీక్ష రాయాల్సి ఉంటే, డయాగ్రమ్స్ వంటివి గీయడానికి అవసరమైన అన్ని పరికరాలూ వాళ్ల వద్ద ఉండేలా చూడండి. మీ పిల్లవాడూ అన్నింటినీ ఒకే చోట పెట్టుకునేలా మీరు సహాయపడవచ్చు, అలా చేయడం వల్ల వాళ్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఒక జిప్ పౌచ్, అదనపు పెన్నులు లేదా పెన్సిళ్లు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. టేబుల్ మీద వాటర్ బాటిల్ పెట్టండి. - వారిని ప్రోత్సహించండి
మీ బిడ్డను ప్రోత్సహించే విషయం గానీ వ్యక్తిగానీ ఎప్పుడూ ఉంటారు. తరచుగా, వాళ్లు పబ్లిక్ ఫిగర్ అయి ఉంటారు. ఆ వ్యక్తి చిత్రాన్ని మీ పిల్లల టేబుల్ మీద పెట్టవచ్చు, ఆ విధంగా మీ పిల్లలు పరీక్షలు బాగా రాయడానికి మీరు ప్రోత్సహించవచ్చు. పరీక్ష రాసేటప్పుడు మీ పిల్లలు చూసే విధంగా నోట్స్ స్టిక్కర్ చేయవచ్చు లేదా స్ఫూర్తిదాయకమైన సూక్తుల్ని పోస్టర్లపై రాసి అతికించవచ్చు. - ఇంట్లో శాంతిని పాటించండి
పరీక్షలు రాయడానికి చాలా శ్రద్ధ అవసరం, వాళ్లకి అంత శ్రద్ధ కలిగేలా చూడాలంటే తల్లిదండ్రులు ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. ఏకాగ్ర చిత్తంతో ఉండడానికీ, ఆలోచించడానికీ, వ్రాయడానికీ ప్రశాంత వాతావరణం అవసరం. ఇంట్లో మీ పిల్లల కోసం నిశ్శబ్దంగా ఉండే పరీక్ష హాల్ వాతావరణాన్ని మీరు సృష్టించడానికి ప్రయత్నించాలి. ఫోన్‌లను ఉపయోగించవద్దనీ, టెలివిజన్ ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచమనీ, గదిలో శబ్దం తక్కువగా ఉండేలా చూడమనీ కుటుంబ సభ్యులకు సూచించండి.
- సౌకర్యవంతమైన చోటు ఎంచుకోండి
పిల్లలు జీవితమనే పరీక్షకు సిద్ధంగా ఉండే విధంగా LEAD భారతదేశంలో విద్యను మారుస్తుంది.
మీ పిల్లవాడిని LEAD పవర్డ్ పాఠశాలలో చేర్పించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.
LEAD పవర్డ్ పాఠశాలలు పరీక్షలకు ముందు అసెస్‌మెంట్లతో విద్యార్థులను ముందుకి ఎలా నడిపిస్తాయి?
విద్యార్థులు తమ సిలబస్‌తో బాగా ప్రావీణ్యం సంపాదించడానికి, LEAD విద్యార్థులకు పరీక్షలలో రాణించేలా ముందుగానే బాగా శిక్షణ ఇస్తారు.
తరువాతి యూనిట్‌కి వెళ్ళే ముందుగానే నేర్చుకోవడంలో ఉన్న కొరతల్ని విద్యార్థులు పూరించుకోవడానికి LEAD అసెస్‌మెంట్లు సహాయపడతాయి. ప్రతి యూనిట్‌లోనూ యూనిట్-ఎండ్ అసెస్‌మెంట్ ఉంటుంది, ఈ అసెస్‌మెంట్స్ వ్రాతపూర్వకంగానైనా, మౌఖికంగానైనా లేదా రెండు రకాలుగానూ ఉండవచ్చు. LEAD లో ప్రతి తరగతికీ ఒక ప్రత్యేకమైన అసెస్‌మెంట్ మోడల్ ఉంటుంది. ఉదాహరణకు, ప్రీ-ప్రైమరీ కోసం, ప్రతి యూనిట్‌లోనూ ప్రతి వారమూ కొన్ని అసెస్‌మెంట్లు ఉంటాయి. వీటిని వీక్లీ అసెస్‌మెంట్స్ అని పిలుస్తారు, ఇవి వర్క్‌షీట్ ఆధారితంగానూ, పరిశీలన ఆధారితంగానూ రెండు రకాలుగా ఉంటాయి.
మిడిల్ స్కూల్ కోసం, విద్యార్థులు ఇంట్లో క్విజ్ తీసుకుంటారు, ఆ క్విజ్, కోర్సు ఆధారంగా ఉంటుంది; వాళ్లు సమాధానాలు తప్పు అయితే కీలక భావనల్ని అర్థం చేసుకోవడానికి వాటిని ఎక్కడ నుంచి సేకరించడం జరిగిందో ఆ మూలాల్ని చూపడం జరుగుతుంది.
హైస్కూల్‌లో, విద్యార్థులకి స్టామినా పెంపొందించడానికీ మరియు బోర్డు-స్ట్రక్చర్ పేపర్‌కి సమాధానాలు ఇవ్వడానికి సహకరించేలా అసెస్‌మెంట్లు జరుపుతారు. సంవత్సరంలో వివిధ సమయాల్లో నేర్చుకోవడంలో ఎలాంటి కొరతలున్నాయో చెక్ చేయడం దీని ఉద్దేశ్యం.
మీ విద్యార్థులకి అద్భుతమైన చదువుని అందించాలని మీరు కోరుకుంటున్నారని LEAD అర్థం చేసుకుంటుంది. చక్కగా చదువుకున్న విద్యార్థులు ప్రగతిబాటలో నడిచి పెద్దవారయ్యాక ఈ విధంగా అవుతారు:
●సమర్థవంతులైన పెద్దలు
●బాధ్యతాయుతమైన పౌరులు
●మంచి మానవులు
మీ పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వండి; LEAD తో వారికి మంచి ట్రైనింగ్ ఇవ్వండి. పిల్లలు జీవితమనే పరీక్షకు సిద్ధంగా ఉండే విధంగా LEAD భారతదేశంలో విద్యను మారుస్తుంది.
మీ పిల్లవాడిని LEAD పవర్డ్ పాఠశాలలో చేర్పించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.