డిజిటల్ ప్రపంచంలో మార్పుకు హైబ్రిడ్ లెర్నింగ్ తోడ్పాటు ఎలా
Give Your School The Lead Advantage
వైరస్‌తో యావత్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తనను తాను “యుద్ధకాల అధ్యక్షుడి”గా ప్రకటించుకోగా, కోవిడ్-19తో ఫ్రాన్స్ “యుద్ధం చేస్తోందని” ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రోన్ ప్రకటించారు. సాధారణంగా మహమ్మారులు, ప్రపంచ యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటి ఉదంతాలు ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తాయి. ప్రస్తుత కరోనావైరస్ సంక్షోభం నిస్సందేహంగా అనేక మంది జీవనాన్ని, ఆర్థిక వ్యవస్థలను, విద్యాభ్యాసాన్ని చిన్నాభిన్నం చేసింది.
ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉంది. అయితే, మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనడం మినహా బైటపడేందుకు మరో మార్గం కనిపించడం లేదు.
స్కూల్స్ ఏ విధంగా ఎదుర్కొంటున్నాయంటే…
లాక్‌డౌన్ ప్రకటించగానే ఎలాంటి అంతరాయాలు లేకుండా తరగతులను నిర్వహించేందుకు పాఠశాలలు సత్వరం ఆన్‌లైన్ బాట పట్టాయి. సంప్రదాయ నాలుగు గోడల తరగతి గదుల స్థానంలోనే రిమోట్ లెర్నింగ్ తెరపైకి వచ్చింది. విద్యార్థులు తమ బాధ్యతలను తామే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ అదృశ్య శత్రువు సృష్టించే ఉపద్రవాన్ని ఎడ్యుకేషన్ సెక్టార్ ముందుగానే ఊహించి తగు చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టింది. సాధారణంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానం అమల్లోనే ఉన్నప్పటికీ పాఠశాలల విషయానికొస్తే ఇదొక పెను మార్పులాంటిది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో సవాళ్లు విధానకర్తలు, విద్యావేత్తలకు అవగతమవసాగాయి. సాంప్రదాయ తరగతి గది, ఆన్‌లైన్ విద్యాభ్యాసాన్ని అనుసంధానించాల్సిన అవసరం తెలిసొచ్చింది.
విద్యా రంగానికి సంబంధించి, ముఖ్యంగా భారతదేశంలో, చేదు నిజం ఏమిటంటే మిగతా రంగాలన్నింటికన్నా ఇది మరింత వేగంగా పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆన్‌లైన్ విద్యాబోధనను అందించడం మాత్రమే సరిపోదు. మార్పునకు శ్రీకారం చుట్టాలనుకునే పాఠశాలలు ముందుగా సదరు మార్పునకు సిద్ధపడాలి, పాత చింతకాయపచ్చడి లాంటి ఆలోచనా విధానాలకు స్వస్తి చెప్పి, విద్యను కొత్త కోణంలో చూడటం ప్రారంభించాలి. వల్లె వేయడం, మ్యాన్యువల్ ప్రక్రియలను విడిచిపెట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాల వైపు మళ్లాలి.
అద్భుతమైన విద్యాభ్యాసం, రిజల్ట్స్ సాధించేందుకు పాఠశాలలు కేవలం ఆన్‌లైన్ క్లాసెస్‌పై ఆధారపడితే సరిపోదు.
“భారీ స్థాయిలో గృహ ఆధారిత దూరవిద్యా విధానాన్ని భారీ స్థాయిలో అమలు చేయాల్సిన పరిస్థితులు అకస్మాత్తుగా వచ్చిపడటమనేది విద్యారంగాన్ని కొత్త కోణంలో చూడటానికి దొరికిన ఒక అవకాశంలాంటిది. విద్యా విషయాలు, విధానాలు, సవాళ్లను పునఃసమీక్షించుకునేందుకు ఇదో అవకాశం. విద్యాభ్యాసానికి సంబంధించి వివిధ విధానాలను మరింతగా మేళవించాల్సిన అవసరం ఉండగా, వ్యక్తిగత విద్యాభ్యాసం, సమూహ సామాజిక విద్యాభ్యాసం మధ్య మరింత మెరుగైన సమతౌల్యం పాటించే విధంగా విద్యాభ్యాస విధానాలను కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంతిమంగా క్లాస్‌రూమ్‌ను, పాఠశాల-ఆధారిత విద్యాభ్యాసాన్ని ఇల్లు, కుటుంబం, మొత్తం సమాజానికి అనుసంధానం చేసేందుకు ఇదొక విశిష్టమైన అవకాశం” అని యూనెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) పేర్కొంది.
డిజిటల్ ప్రపంచంలో మార్పులకు స్కూల్స్ ఏ విధంగా మూలస్తంభాలు కాగలవు?
పాఠశాలలు ఇప్పటిదాకా పాటిస్తున్న హైబ్రీడ్ మోడల్ కాస్త ఆదుకుంటోంది. విద్యా రంగం మరింత బలహీనపడిపోకుండా పరిస్థితిని తన అదుపులోకి తెచ్చింది. రిమోట్ విద్యాభ్యాసంలో లోటుపాట్లను సరిచేసింది.
ఈ మార్పును స్థిరంగా కొనసాగించేందుకు, పాఠశాలలు కొత్త విద్యాభ్యాస విధానాలను మెరుగుపర్చడం, సమీక్షించడం, మరింతగా విస్తరించడం మొదలైన చర్యలు ప్రారంభించాయి. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మటుకు పాఠశాలలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం విధానానికి మళ్లాయి. అడ్మినిస్ట్రేషన్, ఫీ కలెక్షన్, అటెండెన్స్, కొత్త అడ్మిషన్ మొదలైన కీలకమైన పనులను క్రమబద్ధీకరించుకున్నాయి. హోమ్ స్కూలింగ్ విషయానికొస్తే చురుగ్గా పాలుపంచుకోని విద్యార్థులు, కచ్చితమైన ఫలితాలకు హామీ లేకపోవడం, రకరకాలుగా ఉండే పాఠ్యాంశాలు, పాత పాఠశాల పద్ధతిలో విద్యాభ్యాసం వంటి లోటుపాట్లను ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్స్ కాస్త భర్తీ చేయగలిగాయి.
ప్రస్తుతం మనం జీవిస్తున్న పరిస్థితుల్లో సాంప్రదాయ విద్యా విధానాలు ఎందుకూ ఉపయోగపడవనే వాస్తవాన్ని మహమ్మారి రుజువు చేసింది. ఆధునిక విద్య అవసరాలకు సంప్రదాయ బోధనా పద్ధతులు ఉపయోగపడని నేపథ్యంలో హైబ్రీడ్ లెర్నింగ్‌ను ఒక ఐచ్ఛికం (ఆప్షన్)గా అందించే స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్స్ తోడ్పాటుతో ఆన్‌లైన్ తరగతుల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు అధ్యాపకులకు శిక్షణ లభించినట్లవుతుంది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ అనేది వరల్డ్-క్లాస్ కరిక్యులమ్‌ను అందించడంతో పాటు ఆన్‌లైన్ విద్యాభ్యాసంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధ్యాపకులను సుశిక్షితులుగా కూడా తీర్చిదిద్దగలదు.
వల్లె వేయడం, బట్టీ పట్టడం వంటి సాంప్రదాయ విధానాల నుంచి విద్యార్థి కేంద్ర బిందువుగా మరింత డిజిటలీకరణ చెందిన విధానాల వైపు విద్యా రంగం మళ్లడాన్ని కోవిడ్-19 మరింత వేగవంతం చేసింది.
డిజిటల్ లెర్నింగ్ సృష్టించిన వ్యత్యాసాన్ని LEAD School ఏ విధంగా భర్తీ చేస్తోంది?
అత్యంత గడ్డు పరిస్థితుల్లోనూ LEAD School యొక్క సమగ్రమైన బోధనాంశాలు; ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆధారిత విద్యాబోధన; సకాలంలో పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ మరియు గ్యారంటీడ్ రిజల్ట్ వంటివి ఊరటనిచ్చే విషయాలు. అత్యుత్తమ బోధనా ప్రమాణాలను పాటిస్తూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, లేదా హైబ్రీడ్ బోధన ఏ మాధ్యమంలోనైనా కొనసాగేలా LEAD School జాగ్రత్తలు తీసుకుంటోంది. డిజిటల్ లెర్నింగ్ కంటెంట్, ఫిజికల్ రీడర్ మరియు వర్క్‌బుక్స్, అభ్యాస కార్యకలాపాలు, ఈ-బుక్స్, రెగ్యులర్ అసెస్‌మెంట్స్ & ప్రాక్టీస్ క్విజెస్, వ్యక్తిగతీకరించిన రివిజన్స్, హోమ్ ప్రాక్టీస్, లైవ్ క్లాసెస్ మొదలైన వాటి ఊతంతో ఆన్‌లైన్ విద్యాభ్యాసం కాన్సెప్ట్‌ను LEAD School సమూలంగా మార్చేసింది.
నాణ్యత లేని ఆన్‌లైన్ విద్యాబోధన భయాలు, ఆన్‌లైన్ పోర్టల్స్‌ను ఉపయోగించాలంటే టీచర్స్‌లో ఉండే సందేహాలు మొదలైన సమస్యలన్నింటినీ ఇక మర్చిపోవచ్చు. ఉపాధ్యాయులు నేడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆల్‌లైన్ విద్యాభ్యాసంలో ఎలాంటి సవాళ్లనైనా వారు ఇప్పుడు అధిగమించగలరు.
LEAD School గురించి మరింత తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి