టీనేజర్లు సవాళ్లను ఎదుర్కొనేలా చేయడానికి ఎలా సహాయం చేయాలి?
“ఒక కౌమార దశలో ఉన్న పిల్లల్ని పెంచడం చాలా కష్టం … కానీ, కౌమారబాలలుగా ఉండడం ఇంకా చాలా కష్టం. అందువల్లనే ఏదైనా సలహా కోసం రావాలన్నా, మంచీ, చెడూ, చెత్తా చెదారం ఎలాంటి జీవితానుభవాలను పంచుకోవాలన్నా మన పిల్లలకు నమ్మదగ్గ వ్యక్తి ఒకరు కావాలి, “మన పిల్లల జీవితాల్లో మనకి ముందు వరుస సీట్లో కూర్చోవడమన్నది వాళ్లకి అందని ఎత్తైన చోట అల్లంత దూరాన కూర్చుని ఉండడం కంటే చాలా మంచిది.”
కౌమార ప్రాయంలో ఉండటం చాలా ఇబ్బంది. పిల్లలకి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి చాలా ఎక్కువ సహాయం కోరుకునే సమయం ఇదే. వారు తమ అనుభూతుల్నీ, విషయాల్నీ తమలో తాము దాచుకుంటారు తప్ప వాళ్లు అన్ని సార్లూ బయటికి చెప్పరు, ఇది వారి లెర్నింగ్ కర్వ్ ని ప్రభావితం చేస్తుంది. ఈ ఛాలెంజింగ్ సమయంలో వారు ముందుకు నడిచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక సహాయం చేయాలి.
ముందుగానే జోక్యం కల్పించుకోవడమే అసలు కీలకమైన విషయం, మీ పిల్లలకి బయటికిచెప్పుకునే అలవాటున్నా లేకపోయినా, అతడిని/ఆమెనీ ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉండాలి. మీరు ముందుగానే కల్పించుకోవడం వల్లవాళ్లు తమ ఇబ్బందుల్ని సునాయాసంగా దాటేస్తారు, మానసిక సమస్యల నుండి తప్పించుకోవడంలో కూడా వారికి సహాయపడుతుంది.
ఒక టీనేజర్ మనస్సును అర్థంచేసుకునే పద్ధతుల్ని పరిశీలించి, వారికి ఎదురయ్యే సవాళ్లను తెలుసుకుని వారికి సహాయపడదాం.
- వారికిసహాయం చేయడానికి ముందు మిమ్మల్ని మీరు బాగా సిద్ధం చేసుకోండి:
మీ పిల్లవాడు విద్యాపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, తనకి సహాయపడటానికి మీరు మళ్ళీ విద్యార్థి అవ్వండి. నమ్మకమైన, విశ్వసనీయమైన వనరుల ద్వారా నేర్చుకోవడానికి కట్టుబడి ఉండండి. సబ్జెక్టులో నిపుణులతో వ్యక్తిగతంగానూ లేదా ఆన్‌లైన్ శిక్షణలోనూ పాల్గొనండి, వివిధ విశ్వసనీయ దృక్పథాలతో పాఠాల్ని చదవండి.
అవసరమైన వనరులు, బోధనా సూచనలూ లేకుండా కష్టమైన విషయాలను బోధించడం మీ పిల్లల అవగాహనకు హాని కలిగిస్తుంది. వారితో సమానమైన భావోద్వేగాలు కలిగి ఉండి, సరైన విద్యా శిక్షణ పొందడం ద్వారా ఉపాధ్యాయులు దీనిని అధిగమించగలరు. విద్యార్థులు అడిగే అనివార్యమైన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తెలుసుకోవాలి.
- సహాయకసంస్కృతిని సృష్టించండి:
పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ, మద్దతు అందించడం ద్వారా ఒక మంచి సంస్కృతిని సృష్టించడానికి సమయాన్ని వెచ్చించండి. అలాగే, అభ్యసనానికీ, జీవితంలోని అంశాలకీ మధ్య సంబంధాలను అభివృద్ధి చేయడానికీ, అన్వేషించడానికీ వారికి సహాయపడండి. ప్రతి సందర్భమూ ప్రత్యేకమైనదే అయినా, మనుషులుగా మనం పంచుకునే భావాలు, భావోద్వేగాలూ సమయము, భౌగోళికత లేదా సంస్కృతితో సంబంధం లేకుండా అర్ధవంతమైన స్థాయిల్లో ఇతరుల అనుభవాలతో కనెక్ట్ అవ్వడానికి మనకి సహాయపడతాయి.
- వారిసమస్యలను వినండి మరియు అర్థం చేసుకోండి:
మీరు మీ పిల్లలతో సానుభూతిగా మెలగడం నేర్చుకోవాలి. వారి లోపాలు లేదా తప్పుల గురించి ఆందోళన చెందడానికి బదులు, మీరు వారికి సహాయకారిగా మారాలి. ఎవరూ పరిపూర్ణంగా లేరని వారికి నేర్పండి, అలాగే వారు పరిపూర్ణంగా ఉండాలని కోరుకునే బదులు, వారు ప్రతిరోజూ మంచి వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించాలి.
- నిజజీవిత అనుభవాలను హైలైట్ చేయండి:
విద్యార్థులను చైతన్యపరచడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు నిజ జీవితంలో జరిగే ఉదాహరణలను ఉపయోగించాలి. వారి పనితీరును మెరుగుపరచడానికి విలువైన ప్రయత్నాలు చేసినవారి అనుభవాలను హైలైట్ చేయండి. విద్యార్థులు తాము ఏం చేయాలో సరిగా అర్థం చేసుకోగలిగితే వారు మరింత కష్టపడి పనిచేస్తారు.
స్ట్రెస్‌ని విద్యార్థులు ఎలా ఎదుర్కోగలుగుతారు?
మునుపటి కంటే ఎక్కువసార్లు విద్యార్థులతో సన్నిహితంగా ఉండటానికి స్టేక్ హోల్డర్స్ అందరికీ LEAD అవకాశం కల్పించింది. LEAD-పవర్డ్ స్కూళ్లు ఎల్లవేళలా పిల్లల మానసిక, భావోద్వేగ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. LEAD వారానికి ఒకసారి సామాజిక మరియు భావోద్వేగ అభ్యాస సెషన్లను (SEL) నిర్వహిస్తుంది, ఇది వారి భావోద్వేగాలను మేనేజ్ చేయడం, లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించడం ద్వారా పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ లక్ష్యాలు, సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు, కౌమార దశలో వారి మనస్సుని సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రోత్సహిస్తాయి.
హైబ్రిడ్, బ్లెండెడ్ లెర్నింగ్ ఒక తరగతిలో ప్రశ్నలు అడగడానికి సౌకర్యంగా లేని విద్యార్థులు లెర్నింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహించింది. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికీ, విద్యార్థులు వీడియో ఉపన్యాసాలను అవసరమైనప్పుడు సులభంగా రీప్లే చేసుకోవచ్చు. మీ పిల్లల విద్యా నైపుణ్యమనే ఏకీకృత లక్ష్యం కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల మధ్య సరైన సమన్వయం జరిగేటట్లు కూడా LEAD చూసుకుంటుంది.
పిల్లల విద్యా జీవితంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా కీలకం. పిల్లల వేగవంతమైన పెరుగుదలలో తల్లిదండ్రులను కూడా బాధ్యుల్ని చేస్తూ పనితీరు నివేదికలు, మరింత బాగా నేర్చుకోవడం, ఇంటి వద్ద నేర్చుకోవడం కోసం వీడియోలు, యూనిట్ ప్రగతి, క్లాస్‌వర్క్ లో వేసిన బొమ్మలు మొదలైనవి LEAD ఆఫర్ చేస్తుంది.
మీ పిల్లలకి అద్భుతమైన విద్యను ఇవ్వాలనుకుంటున్నారా, అలాగే భవిష్యత్తు కోసం వారిని సంసిద్ధం చేయాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచీ వాళ్లు LEAD పవర్డ్ పాఠశాలలో చదువుతున్నారని నిర్ధారించుకోండి: https://bit.ly/3qyCF95