లైవ్ వర్చువల్ క్లాస్‌రూమ్‌, నేర్చుకోవడాన్ని చైతన్యవంతం చేస్తుంది

కోవిడ్-19 మహమ్మారి వినాశకరమైన పరిణామాలను తగ్గించడానికి ప్రభుత్వాలు వాటాదారులు లైవ్ వర్చువల్ క్లాస్ రూమ్ రూపంలో ఆన్‌లైన్ తరగతుల వైపు వచ్చారు. పైగా, విద్యా వ్యవస్థల్ని పూర్వపు స్థితిలోకి తీసికెళ్లి బలోపేతం చేసి పాఠశాలలను తిరిగి తెరిస్తే భవిష్యత్తులో సంక్షోభాలను సురక్షితంగా ఎదుర్కోవడానికి దేశాలకు తగిన సామర్థ్యం లభిస్తుంది.

కోవిడ్-19 మహమ్మారి పరిణామాలపై పోరాడటానికి ఆన్‌లైన్ లెర్నింగ్ మాత్రమే సరిపోదు. ఆన్‌లైన్ లెర్నింగ్ విశ్వసనీయత గురించి తల్లిదండ్రులు కూడా 21 వ శతాబ్దంలో ఉన్న తమ పిల్లల అవసరాలను తీర్చడానికి సరిపోతుందా లేదా అని చాలా సందేహాస్పదంగా ఉన్నారు. ఈ అయిష్టత కారణంగా విద్యార్థుల డ్రాపౌట్ రేట్లు పెరిగి పిల్లల భవిష్యత్తుకు కోలుకోలేని నష్టం వాటిల్లింది.

లైవ్ వర్చువల్ క్లాస్ రూమ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ పవర్ తో నడిచే విద్యా రంగంలోని ఆధునిక సమస్యలకు గొప్ప పరిష్కారం. మహమ్మారి మన జీవితాల్ని అతలాకుతలం చేయక ముందే, పాఠశాలల్లో సాంకేతికతను చేర్చాల్సిన అవసరం అర్థమైంది; అయితే, మహమ్మారి ఆ అవసరాన్ని మరింత ముందుకు తెచ్చింది. వర్చువల్ క్లాస్ రూమ్ లో విద్యార్థులు వివిధ విషయాలను చూడవచ్చు, కమ్యూనికేట్ చేయవచ్చు, ఇంటరాక్ట్ చేయవచ్చు, చర్చించవచ్చు, తమ ఇన్‌స్ట్రక్టర్‌ తో వన్-టు-వన్ సెషన్ చేయవచ్చు.

వర్చువల్ క్లాస్ రూమ్ లో మనం త్రోసిపుచ్చలేని కొన్ని ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం:

వేగవంతమైన లెర్నింగ్
పాఠ్యపుస్తకాల ద్వారా విషయాలు నేర్చుకునే ప్రక్రియ విద్యార్థులకు చాలా అలసటనిస్తుంది, ఒక అంశాన్ని అర్థం చేసుకోవడానికి నెలల సమయం పట్టేస్తుంది. అంతేకాకుండా, పాఠ్యపుస్తకాల నుంచి బోధించేటప్పుడు ఒక అంశాన్ని ఆసక్తికరంగా మార్చడం ఉపాధ్యాయుల పని. మరోవైపు, లైవ్ వర్చువల్ క్లాస్ రూమ్ వివిధ పద్ధతుల్లో అందుబాటులో ఉంది, దీని ద్వారా ఆడియో-విజువల్, ఇమేజెస్, యానిమేషన్‌లు, గ్రాఫ్‌లు మొదలైన ఆసక్తికరమైన రిసోర్సెస్ ని ఉపయోగించి నేర్చుకోవచ్చు.

మెరుగైన సౌలభ్యం
వర్చువల్ క్లాస్ రూమ్  చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, విద్యార్థులు తరగతులకు ఎక్కడి నుంచైనా హాజరు కావచ్చు. వారు తమ తరగతులను కోల్పోయిన రోజులలో, వారు పాత రికార్డింగ్స్ చూసి నేర్చుకోవచ్చు. రివైజ్ చేసేటప్పుడు కూడా, వాళ్లు ఎక్కడైనా ఇన్‌స్ట్రక్షన్స్ కు తిరిగి వెళ్లి, ఆ కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకునే వరకు చూసుకుంటూ ఉండవచ్చు. పిల్లలపై తక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు, వారు బాగా నేర్చుకుంటారు.

డిజిటల్ నైపుణ్యాలపై పట్టు సంపాదించవచ్చు
పాఠశాలల్లో విద్యార్థులు సాంప్రదాయకంగా నేర్చుకునే అనేక విషయాలు డిజిటల్ యుగంలో అర్ధం లేకుండా పోవచ్చు. అందుకే  వర్చువల్ క్లాసెస్ జరగడమనేది మరే సమయంలో కన్నా కూడా ఇప్పుడు మరింత సముచితంగా అనిపిస్తోంది. నేర్చుకునేటప్పుడు, విద్యార్థి ఇప్పుడూ, భవిష్యత్తులోనూ కూడా రాణించడానికి అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకుంటాడు.

వెంటనే ఫీడ్‌బ్యాక్ మరియు పరిష్కారం
సాంప్రదాయ తరగతి గదుల వలె కాకుండా, ఒక లైవ్ వర్చువల్ క్లాస్‌రూమ్ ఉపాధ్యాయులకు విద్యార్థుల లెర్నింగ్ గ్యాప్స్ ని కనుగొనడంలో సహాయపడుతుంది, అవి మరింత పెరగకుండా ఆపడానికీ, సకాలంలో పరిష్కరించడానికీ సహాయపడుతుంది.

ఆధునిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు
వర్చువల్ క్లాసెస్  గణితం, సైన్సు సబ్జెక్ట్స్ కి మించిన నైపుణ్యాలను నేర్చుకోవడానికి విద్యార్థులకు సహాయపడతాయి. ఉదాహరణకు, టెక్నాలజీ అనేది క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కారం, ఓపిగ్గా పని చేస్తూనే ఉండడం, బృంద సహకారంతో పనిచేయడం, ఆసక్తి వంటి లెర్నింగ్ నైపుణ్యాలను సులభతరం చేస్తుంది.

పై దృక్కోణాన్ని విస్తరిస్తూ, యునిసెఫ్ ఇలా చెబుతోంది, “గణితాన్ని చదవడం, వ్రాయడం, గణిత సమస్యల్ని చేయగల సామర్థ్యాలు వంటి ప్రాథమిక నైపుణ్యాలు అత్యంత కీలకం. వాటితో బాటు కమ్యూనికేషన్, సహకారం, క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కారం వంటి ట్రాన్స్‌ఫరబుల్ స్కిల్స్ కూడా చాలా అవసరం. ఇది డైనమిక్ లేబర్ మార్కెట్‌లకు అలవాటుపడటానికీ, ఇతరులతో కలిసి పనిచేయడానికీ ప్రపంచ లేదా స్థానిక సవాళ్లకు ప్రతిస్పందించడానికీ సహాయపడుతుంది.

భారతదేశంలోని పాఠశాలల్లో అద్భుతమైన విద్యను అందించడానికి LEAD ఎలా సహాయపడుతుంది?

అన్ని క్లాస్ రూమ్‌లనీ ఒక స్మార్ట్ టీవీ మరియు ఒక టీచర్ ఎక్సలెన్స్ కిట్ తోనూ స్మార్ట్ క్లాస్ రూమ్స్ LEAD క్లాస్‌రూమ్‌లుగా మార్చబడతాయి. కాబట్టి కొన్ని స్మార్ట్ క్లాస్ రూమ్‌లకు బదులుగా, ప్రతి క్లాస్ విజువల్ లెర్నింగ్ కోసం ఎనేబుల్ చేయబడుతుంది. LEAD స్కూల్స్ లో ఒక విద్యా సంవత్సరం యూనిట్లుగానూ, అలాగే ఆ యూనిట్లని ఒక రోజు ప్లాన్ గానూ విభజించబడి ఉంటాయి. యూనిట్ల సంఖ్య మరియు అనేక రోజులకి సంబంధించిన ప్లాన్స్ ని ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, మిడిల్, హై ELGA వంటి ప్రతి సబ్-స్కూల్ అవసరాల్నీ దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది.

Virtual classroom
LEADలో, ఉపాధ్యాయులు టాబ్లెట్‌ని ఉపయోగిస్తారు. ఇందులో వివరణాత్మక పాఠ్య ప్రణాళికలు, ఆడియో-విజువల్ వనరులు, సాఫ్ట్ కాపీ బుక్స్, యాక్టివిటీస్ ఉంటాయి. వారు యాక్టివిటీ లేదా వీడియో ద్వారా విద్యార్థులకు కాన్సెప్ట్ లను వివరిస్తారు, తరువాత దాన్ని చిన్న చిన్న గ్రూప్స్ లో గ్రూప్ ప్రాక్టీస్ చేయించడం, ఆ తర్వాత ఇండివిడ్యువల్ ప్రాక్టీస్  జరుగుతుంది. అప్పుడు విద్యార్థులు సొంతంగా ఆ కాన్సెప్ట్ పై వేయబడిన ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఉపాధ్యాయులు ఈ కాన్సంట్రిక్ సర్కిల్ డిజైన్ వల్ల ప్రతి విద్యార్థీ కాన్సెప్ట్ ని అర్థం చేసుకునేలా చేసుకునేలా చేయగలుగుతారు.

అంతిమంగా, విద్యార్థులు ఇలా అభివృద్ధి చెందేందుకు సహాయపడే అద్భుతమైన లెర్నింగ్ ని LEAD అందిస్తుంది:

  • సమర్థవంతమైన పెద్దలు
  • బాధ్యతాయుతమైన పౌరులు
  • మంచి మనుషులు

LEAD మీ పిల్లల భవిష్యత్తుని సిద్ధం చేయడానికి ఉపయోగపడుతోంది. మీ పిల్లవాడిని LEAD పవర్డ్ స్కూల్ లో చేర్చడానికి:ఇప్పుడే అడ్మిషన్ ఫారం నింపండి

About the author

Manasa is a Branding and Communication Manager at LEAD. She is an Asian College of Journalism alumnus and a former Teach for India Fellow. Manasa has also completed her MBA in marketing from Deakin University. She strongly believes that education has the power to shake the world and is excited to be a part of LEAD’s transformational journey.

Manasa Ramakrishnan

More from this author

How student management system helps with online classes?

It is said that major world events often make a way for discoveries and innovations. This time, a pandemic altered how the education sector across the globe functioned for years. As schools shifted on

Know More

Online classes & NEP together replace old learning methods

Why the Indian Education system needed a revamp We are right in the middle of a global crisis.

Know More

Smart classes simplify homeschooling during COVID-19

LEAD School is currently offering LEAD [email protected] for all its partner schools parents. Children can now attend live classes daily, attempt quizzes, ask doubts, without any hassle.

To mitigate the

Know More

With eLearning’s advent, are kids ready for smart schools

This year, the delivery model of education that largely remained unchanged for centuries has suddenly been disrupted owing to the ongoing crisis and according to some experts, this could be a permanen

Know More

Admissions Open

Find a LEAD powered school for your child

whatsapp