జాతీయ విద్యా విధానం (NEP) 2020ను అర్థం చేసుకోవడం
భారతదేశ జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) ను భారత యూనియన్ కేబినెట్ 29 జూలై 2020న ఆమోదించింది. ఈ విధానం భారతదేశ కొత్త విద్యా వ్యవస్థకు సంబంధించిన దృష్టిని (దృక్పథాన్ని ) వివరిస్తుంది. ఇది ముందున్న జాతీయ విద్యా విధానం 1986 ను భర్తీ చేసింది.
ఈ విధానం లక్ష్యం – భారతీయ సంస్కృతి, విలువల ఆధారంగా ఉన్న విద్యా వ్యవస్థను నిర్మించడం. అందరికీ ఉన్నత-నాణ్యత విద్యను అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞాన శక్తిగా మార్చడం దీని ప్రధాన దృష్టి (దృక్పథం)